పల్లెటూరి నుంచి పీఎంవో దాకా… 

by srinivas |   ( Updated:2020-09-13 22:43:34.0  )
పల్లెటూరి నుంచి పీఎంవో దాకా… 
X

దిశ, ఏపీ బ్యూరో : కాటా ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కరలేని పేరు. ఐఏఎస్ అధికారిణి. తాజాగా ప్రధాని కార్యాలయం డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె కుటుంబం మొత్తం ఉన్నతాధికారులే కావడం విశేషం. సొంతూరు ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారు ఎన్.అగ్రహారం. కాటా వెంకటరెడ్డి, పద్మావతి దంపతుల మొదటి సంతానం. విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే.

ఆమ్రపాలి సొంతూరు ఎన్. అగ్రహారంలో శిథిలావస్థకు చేరిన ఇల్లు

2010లో ఐఏఎస్ సాధించారు. తొలుత తెలంగాణలో పనిచేశారు. తొలుత వికారాబాద్ సబ్ కలెక్టర్ గా విధుల్లో చేరారు. తర్వాత రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టరుగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఇంకా హైదరబాద్ నగర మున్సిపల్ కమిషనర్గా, ఎన్నికల కమిషన్లో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వద్ద ప్రైవేటు కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.

కుటుంబమంతా ఉన్నతాధికారులే

ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా విశ్వ విద్యాలయం ఆర్థిక శాస్ర్తం ఆచార్యులుగా చేస్తున్నారు. ఆమె భర్త సమీర్శర్మ ఐపీఎస్ అధికారి. డయ్యూడామన్లో చేస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి. కర్నాటక ఆదాయపన్ను శాఖ విధుల్లో ఉన్నారు. ఆమె భర్త ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ అధికారి. తమిళనాడు సర్కారులో పనిచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed