తహసీల్దార్ తిట్టారు.. క్షమాపణ చెప్పాలని జడ్పీటీసీ ఆందోళన

దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట తహసీల్దార్ అనంతరాజు దురుసుగా ప్రవర్తించారని.. జడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్న ఆందోళనకు దిగారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తహసీల్దార్ కార్యాలయం ముందు భైఠాయించారు. అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లను వదిలిపెట్టడమే కాకుండా.. తహసీల్దార్ వారితో బేరం కుదుర్చుకున్నారని పెంచికలపేట జడ్పీటీసీ సరిత ఆరోపించారు. అటువంటిది తమ ట్రాక్టర్ వెళితే […]

Update: 2021-12-04 04:49 GMT

దిశ, బెజ్జుర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట తహసీల్దార్ అనంతరాజు దురుసుగా ప్రవర్తించారని.. జడ్పీటీసీ సముద్రాల సరిత రాజన్న ఆందోళనకు దిగారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తహసీల్దార్ కార్యాలయం ముందు భైఠాయించారు. అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లను వదిలిపెట్టడమే కాకుండా.. తహసీల్దార్ వారితో బేరం కుదుర్చుకున్నారని పెంచికలపేట జడ్పీటీసీ సరిత ఆరోపించారు. అటువంటిది తమ ట్రాక్టర్ వెళితే మాత్రం ఎందుకు సీజ్ చేశారని అన్నారు. ఇదే విషయంపై ఆరా తీయడానికి వస్తే తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సరిత మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు దీక్ష విరమించమని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News