అధికారులను అభినందించిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా కోర‌ల్లో నుంచి జిల్లాను బ‌య‌ట పడేయడం కృషి చేస్తోన్న జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్న‌ట్లు జ‌డ్పీ ఛైర్మ‌న్ కోరం క‌న‌క‌య్య పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిరుపేదలకు, వలస కూలీలంద‌రికీ బియ్యం, న‌గ‌దు అందేలా ఎంతో శ్ర‌ద్ధ‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్నారని కొనియాడారు. సోమవారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా కనకయ్య మాట్లాడుతూ జిల్లాలో నలుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిందన్నారు. దీంతో అప్రమత్తమైన […]

Update: 2020-04-20 10:10 GMT

దిశ‌, ఖ‌మ్మం: క‌రోనా కోర‌ల్లో నుంచి జిల్లాను బ‌య‌ట పడేయడం కృషి చేస్తోన్న జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్న‌ట్లు జ‌డ్పీ ఛైర్మ‌న్ కోరం క‌న‌క‌య్య పేర్కొన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో నిరుపేదలకు, వలస కూలీలంద‌రికీ బియ్యం, న‌గ‌దు అందేలా ఎంతో శ్ర‌ద్ధ‌తో చ‌ర్య‌లు తీసుకుంటున్నారని కొనియాడారు. సోమవారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా కనకయ్య మాట్లాడుతూ జిల్లాలో నలుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిందన్నారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వైరస్ వ్యాపించ‌కుండా పకడ్బందీగా చర్యలు తీసుకుందని ఆయన అభినందించారు.

tag: ZP Chairman Koram Kanakayya, comments, authorities, corona, Preventive measures, Bhadradri kothagudem

Tags:    

Similar News