బాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్.. ఎస్సీ/ఎస్టీలపై అసభ్యకర కామెంట్స్
దిశ, సినిమా: యాక్ట్రెస్ యువికా చౌదరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన లాస్ట్ వ్లోగ్ వీడియోలో కులవివక్షపై కామెంట్స్ చేసినందుకుగాను ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, పంజాబ్-హర్యానా హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో నటి ఊపిరిపీల్చుకుంది. ఇక గతంలో సోషల్ మీడియాలో అపాలజీ నోట్ షేర్ చేసిన యువిక.. తన వీడియోలో యూజ్ చేసిన వర్డ్ మీనింగ్ తనకు తెలియదని, ఎవరిని హర్ట్ […]
దిశ, సినిమా: యాక్ట్రెస్ యువికా చౌదరిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. తన లాస్ట్ వ్లోగ్ వీడియోలో కులవివక్షపై కామెంట్స్ చేసినందుకుగాను ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, పంజాబ్-హర్యానా హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో నటి ఊపిరిపీల్చుకుంది. ఇక గతంలో సోషల్ మీడియాలో అపాలజీ నోట్ షేర్ చేసిన యువిక.. తన వీడియోలో యూజ్ చేసిన వర్డ్ మీనింగ్ తనకు తెలియదని, ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం లేదని తెలిపింది. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నానని చెప్పింది. ఇక ఈ నోట్‌పై స్పందించిన యువిక భర్త, రియాలిటీ టీవీ స్టార్ ప్రిన్స్ నరుల తనకు మద్దతుగా నిలిచారు. ‘బేబీ ఏది జరిగినా పొరపాటున జరిగింది. నేను నీతో ఉన్నాను బాధపడకు. నువ్వు క్షమాపణలు కూడా చెప్పావు. లవ్ యూ’ అని కామెంట్ చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తామెప్పుడూ కులం గురించి పట్టించుకోమని స్పష్టం చేస్తూ.. అలా అనుకుంటే తమకు పెళ్లి అయ్యేదికాదని వివరించాడు.