బిగ్ బ్రేకింగ్: పోలింగ్ బూత్‌లో వైసీపీ రిగ్గింగ్

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలు ముగిసే సమయానికి రెండు పోలింగ్ బూత్ లలో వైసీపీ రిగ్గింగ్ వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలోని 51, 52 పోలింగ్ బూత్ లలో టీడీపీ ఏజెంట్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆర్వో దగ్గర బ్యాలెట్ పేపర్లు తీసుకోని వైసీపీ గుర్తుపై ముద్ర గుద్ది రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. ఓటర్లు కనిపించాల్సిన పోలింగ్ కేంద్రాల్లో నలుగురు, ఐదుగురు మాత్రమే ఉన్నారు. […]

Update: 2021-04-08 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలు ముగిసే సమయానికి రెండు పోలింగ్ బూత్ లలో వైసీపీ రిగ్గింగ్ వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలోని 51, 52 పోలింగ్ బూత్ లలో టీడీపీ ఏజెంట్లు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆర్వో దగ్గర బ్యాలెట్ పేపర్లు తీసుకోని వైసీపీ గుర్తుపై ముద్ర గుద్ది రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. ఓటర్లు కనిపించాల్సిన పోలింగ్ కేంద్రాల్లో నలుగురు, ఐదుగురు మాత్రమే ఉన్నారు. వారే ఓట్లు వేసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్లపై ఉన్న ఫ్యాన్ గుర్తుపై ఒకరు స్టాంప్ వేసిస్తుంటే మిగిలిన వారు వాటిని బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. దీన్ని గమనించిన టీడీపీ నేతలు నలుగురిని పట్టుకున్నారు. ఇంత యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నా.. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ పోలింగ్ బూత్ ముందు టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అధికారులు రంగంలోకి దిగారు. వైసీపీకి వేసిన ఓట్లు తొలగించి, మళ్లీ ఓటింగ్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News