‘మంత్రులకి కాఫీలు, టీలు మోయడానికా మీరుంది’

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా అధికారులపై వరుసగా రెండో రోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఉన్నది మంత్రులకు కాఫీ, టిఫిన్లు మోసేందుకా? అంటూ ఆనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. రావూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల కోసం స్థలం అవసరముందని, ఐదెకరాల భూమి కోసం ప్రిన్సిపల్ ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఆనం మండిపడ్డారు. గిరిజన […]

Update: 2020-06-04 07:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా అధికారులపై వరుసగా రెండో రోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఉన్నది మంత్రులకు కాఫీ, టిఫిన్లు మోసేందుకా? అంటూ ఆనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. రావూరులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల కోసం స్థలం అవసరముందని, ఐదెకరాల భూమి కోసం ప్రిన్సిపల్ ఇంకా వెతుకుతూనే ఉన్నారని ఆనం మండిపడ్డారు. గిరిజన గురుకులం భనవ నిర్మాణం గురించి ఐటీడీఏ పీఓ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. నీటి పారుదల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం చెప్పినా అధికారులు వినిపించుకోవడంలేదని ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News