చెప్పేంతవరకు ఎవరూ రావద్దు: అవంతి

విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన నేపధ్యంలో కంపెనీ సమీప గ్రామాలు వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లకు చెందిన వారెవరూ తొందరపడి రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రస్తుతం ఉండటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. దానిపై స్పష్టత వచ్చి, ప్రభుత్వానికి నివేదిక వచ్చే వరకు ప్రజలు ఎవ్వరూ గ్రామాల్లోకి రావద్దని […]

Update: 2020-05-10 07:31 GMT

విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన నేపధ్యంలో కంపెనీ సమీప గ్రామాలు వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌లకు చెందిన వారెవరూ తొందరపడి రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. వైజాగ్‌లో ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రస్తుతం ఉండటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేవా? అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. దానిపై స్పష్టత వచ్చి, ప్రభుత్వానికి నివేదిక వచ్చే వరకు ప్రజలు ఎవ్వరూ గ్రామాల్లోకి రావద్దని కోరారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలోని స్టైరిన్ గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందని, అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు.

Tags:    

Similar News