వైసీపీ ఖాతాలో ఏలూరు కార్పొరేషన్

దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు కార్పొరేషన్‌ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మెుదలైంది. ఈ కౌంటింగ్‌లో ఇప్పటి వరకు 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 8 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒక డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇకపోతే మొత్తం 50 డివిజన్లకు గాను మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా […]

Update: 2021-07-25 03:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏలూరు కార్పొరేషన్‌ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఆదివారం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మెుదలైంది. ఈ కౌంటింగ్‌లో ఇప్పటి వరకు 26 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 8 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒక డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇకపోతే మొత్తం 50 డివిజన్లకు గాను మూడు డివిజన్లలో వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగిలిన 47డివిజన్లకు మార్చి 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు కౌంటింగ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆదివారం సీఆర్ రెడ్డి కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు చేపట్టారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.

Tags:    

Similar News