సీఎం జగన్‌కు భారీ షాక్.. సీబీఐ అధికారులను కలిసిన వైఎస్ వివేకా కూతురు!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు జరిపిన దాడిలో తలకు తీవ్రగాయమై మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డి డిమాండ్ మేరకు సీఐడీకి […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు జరిపిన దాడిలో తలకు తీవ్రగాయమై మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డి డిమాండ్ మేరకు సీఐడీకి అప్పగించారు. దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. పలు వాదనల అనంతరం కోర్టు ఈ కేసును సీబీఐకు బదిలీ చేసింది. తాజాగా వివేకా కూతురు ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్యకేసులో జరుగుతున్న విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
మర్డర్ జరిగి రెండేళ్లు గడిచినా ఇంతవరకు నిందితులు ఎవరు అనేది తేల్చకపోవడంపై మండిపడ్డారు. తన తండ్రి సున్నిత మనస్సుగల వారని, ఆయన ఎలాంటి వారో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. కడపకు వైఎస్ వివేకా ఎన్నో సేవలు చేశారని.. దోషులను పట్టుకోవడానికి జాప్యం ఎందుకు జరుగుతుందో సీబీఐ అధికారులు వెల్లడించాలన్నారు. న్యాయం కోసం తాము ఎంతకాలం ఎదురుచూడాలి, తమలాంటి వారికే ఇలా జరిగితే మరి సామాన్యుల పరిస్థితి ఎంటన్నీ ప్రశ్నించారు. విచారణ ఎంత ఆలస్యమైతే న్యాయం అంత దూరమైనట్లు అని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని, ఒక డాక్టర్‌గా తనకు తెలుసునని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవహారాల వల్లే ఈ దారుణం జరిగిందని తానే భావించడం లేదన్నారు. ఇదిలాఉండగా, సీఎం జగన్‌ను సంప్రదించకుండా ఆమె నేరుగా సీబీఐ అధికారులను కలువడం పట్ల ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆమెకు నమ్మకం లేదని వివేకా కూతురు సునీతారెడ్డి చెప్పకనే చెప్పినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.