పాలన చేతకాకుంటే దిగిపో.. సీఎం కేసీఆర్ పాలనపై షర్మిల ధ్వజం

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కరోనా నివారణకు సీఎం కేసీఆర్ కల్పించిన ఏర్పాట్లపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ కు పాలన చేతకాకుంటే కోర్టులకో, గవర్నర్ కో అప్పజెప్పాలని బుధవారం ట్టిట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేషేంట్ల కోసం సరిపడా అంబులెన్సులు అందుబాటులో లేవని, టెస్టులు చేసేందుకు కిట్లు లేవని ఆమె పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సరిపడ డాక్టర్లు, సిబ్బంది కూడా లేరని షర్మిల పేర్కొన్నారు. ఆక్సీజన్ లేదు, వాక్సిన్లు కూడా లేవని మండిపడ్డారు. […]

Update: 2021-05-12 10:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కరోనా నివారణకు సీఎం కేసీఆర్ కల్పించిన ఏర్పాట్లపై వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ కు పాలన చేతకాకుంటే కోర్టులకో, గవర్నర్ కో అప్పజెప్పాలని బుధవారం ట్టిట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేషేంట్ల కోసం సరిపడా అంబులెన్సులు అందుబాటులో లేవని, టెస్టులు చేసేందుకు కిట్లు లేవని ఆమె పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సరిపడ డాక్టర్లు, సిబ్బంది కూడా లేరని షర్మిల పేర్కొన్నారు. ఆక్సీజన్ లేదు, వాక్సిన్లు కూడా లేవని మండిపడ్డారు. కోర్టులు చెబితే కానీ మీకు ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు పాలన వారికే అప్పగించాలని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో ఆపద ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు ఎక్కడ పోయాయని సీఎం కేసీఆర్ ను షర్మిల ప్రశ్నించారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు రూపాయికి బదులు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారని, ప్రైవేట్ అంబులెన్సులు అడ్డగోలుగా దోచుకుంటున్నా మీకు కనిపించడం లేదా అని విమర్శలు చేశారు.

Tags:    

Similar News