కేటీఆరా..! ఆయనెవరు..? వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనకెవరో తెలియదంటూ వైస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్ లో శుక్రవారం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేసేందుకు షర్మిల పూనుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. షర్మిల ప్రతి వారం వ్రతం చేస్తోందని కామెంట్ చేశారు. ఈ అంశంపై […]

Update: 2021-07-16 05:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనకెవరో తెలియదంటూ వైస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్ లో శుక్రవారం ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేసేందుకు షర్మిల పూనుకుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. షర్మిల ప్రతి వారం వ్రతం చేస్తోందని కామెంట్ చేశారు. ఈ అంశంపై షర్మిల మాట్లాడుతూ..

కేటీఆర్‌కు, టీఆర్ఎస్ మహిళలకు కనీస గౌరవమివ్వడం కూడా తెలియదని విమర్శలు చేశారు. ఆడవారంటే వంటింటి కుందేళ్లుగానే వారు భావిస్తారని చురకలంటించారు. వారలా ఉండటం వల్లే టీఆర్ఎస్‌లో మహిళలకు ప్రాధాన్యం దక్కలేదని విమర్శలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధికి కుర్చీ కూడా వేయని టీఆర్ఎస్ నేతలు మహిళల గురించి మాట్లాడుతారా? అంటూ మండిపడ్డారు. పాదయాత్రలు చేపట్టడంపై సైతం ఆమె క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే పాదయాత్ర చేపడుతానని షర్మిల పేర్కొన్నారు.

ఉద్యమం సమయంలో మంత్రి హరీశ్ రావు యువతను రెచ్చగొట్టారని షర్మిల విమర్శలు చేశారు. పెట్రోల్ తెచ్చుకున్న ఆయనకు అగ్గిపెట్టె తెచ్చుకోవడం తెలియదా? అంటూ ప్రశ్నించారు. ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడాన్ని చూసి ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. వారి చావులకు కారణం హరీశ్ రావు కాదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు అమ్ముడుపోయిందని అందుకే రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవి దక్కిందన్నారు. ఆయన కాంగ్రెస్‌కు సీఈవో మాత్రమేనని విమర్శలు చేశారు. వైఎస్సార్ వారసులమని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలని మండిపడ్డారు.

బీజీపీ ఒక మతతత్వ పార్టీ అని, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తమ పార్టీయేనని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలన్నీ పార్టీలన్నీ తొత్తులుగా మారాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు ఎవరి పొత్తు అక్కర్లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆమె స్పష్టం చేశారు.

Tags:    

Similar News