సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు

దిశ, తెలంగాణ బ్యూరో : స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి కొంతమందికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడంతో ఆడబిడ్డలు కన్నీరు పెట్టుకుంటున్నారని వైఎస్ షర్మిల బుధవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. అన్నం పెట్టినట్టే పెట్టి కంచం లాకున్నట్టు సీఎం కే సీఆర్ తీరు ఉందని ఆమె విమర్శలు చేశారు. తోటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చి వీళ్లకు ఇవ్వకపోవడం దారుణమని, తెలంగాణలో ఆడబిడ్డల కన్నీరు మంచిది కాదు దొర అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు […]

Update: 2021-05-27 07:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని చెప్పి కొంతమందికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడంతో ఆడబిడ్డలు కన్నీరు పెట్టుకుంటున్నారని వైఎస్ షర్మిల బుధవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. అన్నం పెట్టినట్టే పెట్టి కంచం లాకున్నట్టు సీఎం కే సీఆర్ తీరు ఉందని ఆమె విమర్శలు చేశారు. తోటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చి వీళ్లకు ఇవ్వకపోవడం దారుణమని, తెలంగాణలో ఆడబిడ్డల కన్నీరు మంచిది కాదు దొర అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంపికైన 658 మంది స్టాఫ్ నర్సులను వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ‘ఆపదలో తోడుగా వైఎస్ఎస్సార్’ కార్యక్రమం ద్వారా కొవిడ్ బాధితులకు ఆర్థికసాయం అందజేశారు. నిర్మల్ జిల్లా, కడెం మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి శ్రీనివాస్ ఇటీవల కరోనాతో మరణించగా బాధిత కుటుంబానికి షర్మిల టీం నగదు అందజేసి భరోసా కల్పించారు.

Tags:    

Similar News