అరె ఏంట్రా ఇది.. కౌన్సిలింగ్‌కు హాజరుకాని షణ్ముఖ్
దిశ, వెబ్‌డెస్క్: షణ్ముఖ్ జశ్వంత్.. వెబ్ సిరీస్‌లు ఇష్టపడే వాళ్లకు ఇతని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించాడు. దాంతో అతనికి మంచి గుర్తింపు లభించడంతో పాటు, ఇప్పుడిప్పుడే పలు షోల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. ఇటీవల డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ షణ్ముక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. షణ్ముక్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల […]
దిశ, వెబ్‌డెస్క్: షణ్ముఖ్ జశ్వంత్.. వెబ్ సిరీస్‌లు ఇష్టపడే వాళ్లకు ఇతని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకర్షించాడు. దాంతో అతనికి మంచి గుర్తింపు లభించడంతో పాటు, ఇప్పుడిప్పుడే పలు షోల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఊహించని షాక్ తగిలింది. ఇటీవల డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ షణ్ముక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. షణ్ముక్‌కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన ఆదేశాలను షణ్ముక్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదని సమాచారం. దీంతో షణ్ముఖ్‌పై ఆగ్రహంతో ఉన్న జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టు ప్రొసీడింగ్స్‌కు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో షణ్ముఖ్ జశ్వంత్ ఫుల్లుగా తాగి నాలుగు వాహనాలను(రెండు కార్లు, రెండు బైకులు) ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో షణ్ముఖ్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో టెస్ట్ చేయగా.. 170 రీడింగ్ వచ్చనట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అదుపులోకి తీసుకొని, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన విషయం విదితమే. అయితే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయగా, జశ్వంత్ పట్టించుకోకుండా వ్యవహించారు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు ప్రారంభం అయ్యాయి. షణ్ముఖ్ ఊత పదమైన ‘అరె ఏంట్రా ఇది’ అంటూ.. కౌన్సిలింగ్‌కు హాజరుకాకపోవడం ఏంట్రా అంటూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. అంతేగాకుండా అతనిపై వార్తలు కూడా తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మరి షణ్ముఖ్ కథ ఎంతదూరం వెళుతుంతో చూడాలి.