టిక్‌టాక్‌లా మారబోతున్న యూట్యూబ్?
యూట్యూబ్, టిక్ టాక్.. ఈ రెండు యాప్‌లు చాలా ఫేమస్. రెండూ వీడియోలు ప్లే చేసే యాప్‌లే.. కాకపోతే తేడా ఒక్కటే. యూట్యూబ్‌లో వీడియో నిడివికి పరిమితి లేదు. కావాలనుకుంటే 24 గంటలుండే వీడియోను కూడా పెట్టుకోవచ్చు. కానీ టిక్‌టాక్‌లో వీడియో నిడివికి పరిమితి ఉంది. 5 నుంచి 16 సెకన్ల వీడియోలకు ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. ఒక్కసారి టిక్‌టాక్ ఓపెన్ చేశామంటే చాలు.. వీడియోలు చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. మనకు తెలియకుండానే […]
యూట్యూబ్, టిక్ టాక్.. ఈ రెండు యాప్‌లు చాలా ఫేమస్. రెండూ వీడియోలు ప్లే చేసే యాప్‌లే.. కాకపోతే తేడా ఒక్కటే. యూట్యూబ్‌లో వీడియో నిడివికి పరిమితి లేదు. కావాలనుకుంటే 24 గంటలుండే వీడియోను కూడా పెట్టుకోవచ్చు. కానీ టిక్‌టాక్‌లో వీడియో నిడివికి పరిమితి ఉంది. 5 నుంచి 16 సెకన్ల వీడియోలకు ఈ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. ఒక్కసారి టిక్‌టాక్ ఓపెన్ చేశామంటే చాలు.. వీడియోలు చూస్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. మనకు తెలియకుండానే సమయం గడిపేస్తుంటాం. యూట్యూబ్‌లో అలా కాదు.. మనం గడుపుతున్న సమయం వీడియో నిడివిని బట్టి తెలుస్తుంది. కానీ ఏ కంపెనీ అయినా తమ యాప్‌లో ఎక్కువ సేపు గడపాలని యోచిస్తుంది. అందుకే ఇప్పుడు దిగ్గజ సంస్థలన్నీ టిక్‌టాక్‌ను అనుసరిస్తున్నాయి.
మొన్నటికి మొన్న ఇన్‌స్టాగ్రామ్ కూడా ‘రీల్స్’ పేరుతో టిక్‌టాక్ లాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూట్యూబ్ కూడా 15 సెకన్ల పాటు మొబైల్ యాప్ ద్వారా వీడియోను అప్‌లోడ్ చేసే సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్ మాదిరిగా వీడియో పాజ్ చేసి, బిట్ రికార్డ్ చేస్తే, 15 సెకన్ల నిడివి పూర్తయ్యాక దాన్ని యూట్యూబ్ కంబైన్ చేసి వీడియోలాగా సేవ్ చేస్తుంది. 15 సెకన్ల కంటే ఎక్కువ నిడివి గల వీడియోను ఈ ఆప్షన్ ద్వారా అప్‌లోడ్ చేయడం కుదరదు. అలా చేయాలంటే మళ్లీ విడిగా వీడియో తీసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలి. అసలే యూట్యూబర్లకు, టిక్‌టాక్ స్టార్లకు వివాదాలు నడుస్తున్న సమయంలో ఇలా యూట్యూబ్, టిక్‌టాక్‌ను ఫాలో అవడం ఒకింత ఆలోచనలో పడేస్తుంది.