యూట్యూబ్‌లో ఇక.. నో ‘డిస్ లైక్’ బటన్

దిశ, ఫీచర్స్: పాటలు, పాకశాల ఘుమఘుమలు, అంతరిక్ష విశేషాలు, ఆర్థిక పాఠాలు ఇలా అంశం ఏదైనా.. ‘యూట్యూబ్’ వీడియోలో చూస్తే, ఇట్టే అర్థమైపోతాయి. లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్ చూసే వారి సంఖ్య కాదు, చానల్స్ పెట్టే వాళ్లు కూడా పెరిగిపోయింది. అయితే అందులో మనకు నచ్చిన వీడియోలకు లైక్ కొడుతాం. నచ్చనివాటికి డిస్ లైక్ బటన్ ట్యాప్ చేసేస్తాం. అయితే ఇది సహజంగా ఆ వీడియోపై ఉన్న అభిప్రాయమైతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొంతమంది యూజర్లు […]

Update: 2021-04-02 03:44 GMT

దిశ, ఫీచర్స్: పాటలు, పాకశాల ఘుమఘుమలు, అంతరిక్ష విశేషాలు, ఆర్థిక పాఠాలు ఇలా అంశం ఏదైనా.. ‘యూట్యూబ్’ వీడియోలో చూస్తే, ఇట్టే అర్థమైపోతాయి. లాక్‌డౌన్ నుంచి యూట్యూబ్ చూసే వారి సంఖ్య కాదు, చానల్స్ పెట్టే వాళ్లు కూడా పెరిగిపోయింది. అయితే అందులో మనకు నచ్చిన వీడియోలకు లైక్ కొడుతాం. నచ్చనివాటికి డిస్ లైక్ బటన్ ట్యాప్ చేసేస్తాం. అయితే ఇది సహజంగా ఆ వీడియోపై ఉన్న అభిప్రాయమైతే ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కొంతమంది యూజర్లు వీడియోలకు దురుద్దేశంతో డిస్‌లైక్‌లను కొట్టడం ఒక వ్యసనంగా మారింది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 30న ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ‘డిస్ ‌లైక్స్’ వెల్లువెత్తాయి. కరోనా టైమ్‌లో నీట్, జేఈఈ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణం. అలానే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ‘సడఖ్‌-2’ చిత్రానికి హయ్యెస్ట్ డిసైలైక్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత వరుణ్‌ ధవన్‌ ‘కూలీ’ చిత్ర బృందం తమ వీడియోకు లైక్‌, డిస్‌లైక్‌ బటన్‌ లేకుండా చేసింది. అయితే ఇలా ఏదో కారణంతో, దురుద్దేశంతో ‘డిస్ లైక్’ చేస్తుండటంతో యూట్యూబ్ ఇందుకు ఓ పరిష్కారం ఆలోచిస్తోంది.

లైక్, డిస్‌లైక్స్ అనేవి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని వెల్లడించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందన్నది కాదనలేని సత్యం. కాకపోతే, కక్షపూరితంగా చేయడం వల్ల సదరు యూట్యూబ్ చానల్ లేదా వీడియోకు తీవ్ర నష్టం కలగొచ్చు. డిస్ లైక్ వల్ల కొందరు ఆత్మన్యూనతకు గురికావచ్చు. అందుకు యూట్యూబ్ దీనిపై యాక్షన్ తీసుకునేందుకు, ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘డిస్ లైక్’ కనిపించకుండా చేయాలని యోచిస్తోంది. ఇందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తుండగా, భవిష్యత్తులో యూట్యూబ్‌ వీడియోలకు డిస్‌లైక్‌ల సంఖ్య కనిపించకుండా లేదా డిస్ లైక్ బటన్ లేకుండా చేయడానికి ‘టెస్ట్ రన్’ చేస్తున్నట్లు యూట్యూబ్ తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. యూజర్ల నుంచి సూచనలు తీసుకున్న తర్వాత ఈ ఫీచర్‌ను అమలు చేయనుంది. గతంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఇలాంటి ఫీచర్‌ను పరీక్షించాయి.

https://twitter.com/YouTube/status/1376942486594150405

Tags:    

Similar News