తలకొండపల్లిలో మంత్రి సబితాఇంద్రారెడ్డికి ఊహించని షాక్
దిశ, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో మంత్రి సబితాఇంద్రారెడ్డికి శనివారం ఊహించని షాక్ తగిలింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని యువజన కాంగ్రెస్, ఏబీవీపీ, ఎమ్మార్పీఎస్ నేతలు అడ్డుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకుంటామని ముందే ప్రకటించినా, పలువురు యువజన నేతలను ముందస్తు అరెస్టులు చేసినా, పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా మంత్రికి నిరసన సెగ తప్పలేదు. తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి వస్తోన్న మంత్రి కాన్వాయ్ […]
దిశ, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో మంత్రి సబితాఇంద్రారెడ్డికి శనివారం ఊహించని షాక్ తగిలింది. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని యువజన కాంగ్రెస్, ఏబీవీపీ, ఎమ్మార్పీఎస్ నేతలు అడ్డుకున్నారు. మంత్రి పర్యటనను అడ్డుకుంటామని ముందే ప్రకటించినా, పలువురు యువజన నేతలను ముందస్తు అరెస్టులు చేసినా, పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా మంత్రికి నిరసన సెగ తప్పలేదు. తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి వస్తోన్న మంత్రి కాన్వాయ్ ఒక్కసారిగా ఎదురెళ్లారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘‘కేసీఆర్ డౌన్ డౌన్.. సబితమ్మ గో బ్యాక్’’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసన కారులపై లాఠీలు ఝులిపించారు. సమస్యలపై నిరసన తెలిపితే అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని వార్నింగ్ ఇచ్చారు.