రూ.1000 కోట్లు కేటాయించాలి.. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకుడు చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈనెల 27న కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో నిర్వహిస్తున్న అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌలె జగన్నాథం చికోటిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. ఈ సభకు విశ్వకర్మలంతా పాల్గొని తమ ఐకమత్యాన్ని చాటాలన్నారు. విశ్వకర్మలంతా వారి, వారి పిల్లల భవిష్యత్ కోసం పోరాడాలన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వకర్మలను చిన్నచూపు చూశాయని ఆయన ఫైరయ్యారు. కుల వృత్తిపై ఆధారపడిన విశ్వకర్మలంతా వారి హక్కుల కోసం పోరాడకుంటే పరిస్థితి రానున్న రోజుల్లో మరింత దారుణంగా మారే అవకాశముందన్నారు. రెడ్డి, ఆర్య వైశ్య, బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, కానీ విశ్వకర్మలకు ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని ప్రవీణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విశ్వకర్మల పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు అందించాలని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు.