స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందాలి
దిశ, శంకర్ పల్లి: యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందాలని మహారాజ్పేట్ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి సూచించారు. శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి వద్ద ఆదివారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేస్తే మరికొంతమందికి ఉపాధి లభించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహాచారి, […]
దిశ, శంకర్ పల్లి: యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందాలని మహారాజ్పేట్ గ్రామ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి సూచించారు. శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి వద్ద ఆదివారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకున్న యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేస్తే మరికొంతమందికి ఉపాధి లభించినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహాచారి, దశరథ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.