జిమ్ వైపు యువత చూపు

దిశ, పరిగి : ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకనే ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో అందరూ బిజీబిజీగా ఉరుకులు, పరుగులతో గడిపేస్తున్నారు. తినే తిండి విషయంలో ఫాస్ట్​ఫుడ్, బేకరీ ఫుడ్​కు అలవాటు పడడంతో స్థూలకాయ సమస్యలు పెరిగి పోతున్నాయి. శరీరం అలిసి పోకుండా యంత్రాలతోనే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాం. దీంతో బీపీ, షుగర్ ఇతర వ్యాధులు దరిచేరుతున్నా యి. ప్రతి నిత్యం వాకింగ్, జాగింగ్ చే యాలంటూ డాక్టర్ల సలహాలు […]

Update: 2020-10-12 02:53 GMT

దిశ, పరిగి : ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకనే ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో అందరూ బిజీబిజీగా ఉరుకులు, పరుగులతో గడిపేస్తున్నారు. తినే తిండి విషయంలో ఫాస్ట్​ఫుడ్, బేకరీ ఫుడ్​కు అలవాటు పడడంతో స్థూలకాయ సమస్యలు పెరిగి పోతున్నాయి. శరీరం అలిసి పోకుండా యంత్రాలతోనే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాం. దీంతో బీపీ, షుగర్ ఇతర వ్యాధులు దరిచేరుతున్నా యి. ప్రతి నిత్యం వాకింగ్, జాగింగ్ చే యాలంటూ డాక్టర్ల సలహాలు ఇస్తున్నా రు. దీంతో యువత వాకింగ్, రన్నింగ్​తోపాటు జిమ్​వైపునకు మొగ్గుచూపుతున్నారు.

చలికాలంలో ఎక్కువ ఆదరణ..

చలికాలం వచ్చిందంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, జిమ్​కు వెళ్లడం ఎక్కువగా చూస్తుంటాం. పరిగిలోని మినీస్టేడియంలో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేస్తు న్నారు. చలికాలంలోనే శరీరంలో మార్పులకు ఎక్కువగా అనుకూలంగా ఉండడంతో అందరూ ఎక్కువగా వ్యాయామంపై దృష్టి సారిస్తారు.

చెడు వ్యసనాలకు దూరంగా..

వ్యాయామం చేయడం వల్ల ముఖ్యంగా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నామని యువకులు చెబుతున్నారు. మంచి శరీరాకృతిని పొందేందుకు యువత ఆసక్తి చూపిస్తూ జిమ్​కు వెళ్తున్నారు. ఉదయాన్నే లేవడం జిమ్​కు వెళ్లడంతో శారీరక, మానసిక ప్రశాంతత పొందుతున్నామని చెబుతున్నారు. ఆకట్టుకునే శరీరాకృతికి జిమ్ ఎంతగానో దోహపడుతుందని యువకులు చెబుతున్నారు.

చలికాలంలో మరింత ఆసక్తి..

నిత్యం జిమ్​కు వెళ్లడంతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడంతో ఎక్కువ సమయం జిమ్ చేసి మంచి శరీరాకృతిని పొందవచ్చు. కొన్నేళ్లుగా జిమ్​కు వెళ్తున్నా. మంచి కోచ్​తో వ్యాయామాన్ని పొందుతున్నాం. –రఘువీర్, ఉపాధ్యాయుడు

తక్కువ డబ్బులతో జిమ్ నిర్వహణ..

పరిగిలో ఫిట్​నెస్​జిమ్​ కొన్నేళ్లుగా నడుపుతున్నాం. పరిగి మున్సిపాలిటీగా మారినా గ్రామ పంచాయతీ రేట్లతోనే జిమ్ నడుపుతున్నాం. యువత జిమ్​కు వస్తున్నారు. ఆరోగ్యం, మంచి శరీరాకృతిని పెంపొందించే ప్రధాన ఉద్దేశంతోనే జిమ్​ను నడుపుతున్నా. – అబ్దుల్ తయ్యబ్, జిమ్​కోచ్

Tags:    

Similar News