పోలీస్‌స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

 దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మిడ్జిల్ పోలీస్‌స్టేషన్ దగ్గర ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని శివ అనే యువకుడు నిప్పంటించుకున్నాడు. అతనికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. తనకు సంబంధంలేని కేసులో ఇరికించి పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై స్పందించిన పోలీసులు శివ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని.. ఓ అమ్మాయి కేసు విషయంలో పిలిపించామని చెబుతున్నారు. […]

Update: 2021-03-23 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మిడ్జిల్ పోలీస్‌స్టేషన్ దగ్గర ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకుని శివ అనే యువకుడు నిప్పంటించుకున్నాడు.

అతనికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. తనకు సంబంధంలేని కేసులో ఇరికించి పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. దీనిపై స్పందించిన పోలీసులు శివ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని.. ఓ అమ్మాయి కేసు విషయంలో పిలిపించామని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News