17 ఏళ్ల యువతి అదృశ్యం.. తండ్రి అనుమానం నిజమేనా..?
దిశ, పరిగి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ మైనర్ బాలిక అదృశ్యమైంది. పరిగి ఎస్ఐ పి. విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన బి. గణేష్ కూతురు (17) నల్గొండ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చదువుతోంది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పరిగికి వచ్చింది. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్లింది. ఆదివారం రాత్రయినా ఇంటికి రాలేదు. తెలిసిన వ్యక్తులు, బంధువులు, ఆమె స్నేహితుల వద్ద వెతికినా […]
దిశ, పరిగి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ మైనర్ బాలిక అదృశ్యమైంది. పరిగి ఎస్ఐ పి. విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి టీచర్స్ కాలనీకి చెందిన బి. గణేష్ కూతురు (17) నల్గొండ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో చదువుతోంది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పరిగికి వచ్చింది. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్లింది. ఆదివారం రాత్రయినా ఇంటికి రాలేదు. తెలిసిన వ్యక్తులు, బంధువులు, ఆమె స్నేహితుల వద్ద వెతికినా ఆచూకి లభించలేదు. టీచర్స్ కాలనీకి చెందిన సూర్య అనే వ్యక్తిపై అనుమానం ఉందని తండ్రి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు.