ప్లీజ్ ప్యాంటు, షర్ట్ విప్పు.. ఆమె కోరికను కాదనలేకపోయిన యువకుడు.. చివరికి

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ పరిచయాల వలన మోసపోయినవారి గురించి పోలీసులు నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా కొంతమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా  ఓ యువకుడు అమ్మాయి మోజులో పడి  డబ్బులు పోగొట్టుకున్న ఘటన  ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబై కి చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్ బుక్ పేజ్ […]

Update: 2021-07-11 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ పరిచయాల వలన మోసపోయినవారి గురించి పోలీసులు నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా కొంతమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అమ్మాయి మోజులో పడి డబ్బులు పోగొట్టుకున్న ఘటన ముంబైలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబై కి చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్ బుక్ పేజ్ లో ఓ అందమైన యువతి ఫోటోతో ఓ అకౌంట్ ఓపెన్ అయ్యింది. దాంతో చాలా మంది ఆ అకౌంట్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. దీంతో యువకుడు కూడా రిక్వెస్ట్ పెట్టాడు.

ఇక కొన్ని రోజులకు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సప్ట్ చేసిన అమ్మాయి చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. కొద్దీ రోజుల్లో వాట్స్ యాప్ నెంబర్లను మార్చుకున్నారు. ఇక అలా చాటింగ్ చేస్తున్న సమయంలో ఒకరోజు అర్ధరాత్రి యువకుడికి, యువతి వీడియో కాల్ చేసింది. అతడిని రెచ్చగొడుతూ మాట్లాడుతూ అర్ద నగ్నంగా కనిపించింది. ఆ తర్వాత నగ్నంగా కనపడాలా అని అడగడంతో తలూపాడు. అలా కనపడాలంటే.. నువ్వు కూడా అలా కనిపించాలి అని కోరింది. షర్ట్ విప్పేశాడు. షర్ట్ మాత్రమే కాదు.. ప్యాంట్స్ కూడా విప్పాలి అంది.. సరే అని విప్పేశాడు. పూర్తిగా నగ్నంగా కనిపిస్తేనే.. తానూ అలా కనిపిస్తానని చెప్పింది. ముందూ వెనకా ఆలోచించకుండా.. పూర్తిగా బట్టలిప్పేసి.. ఆమె ముందు నగ్నంగా కనిపించాడు. చాలా బాగున్నావ్.. సూపర్ అంటూ.. ఆమె కాల్ కట్ చేసింది. ఆ తర్వాత… ఆ కాల్‌కి ఎన్నిసార్లు కాల్ చేసినా… స్విచ్ఛాఫ్ అనే వచ్చింది.

మరుసటి రోజు యువకుడు నగ్నంగా కనిపించిన ఫొటో ఒకటి అతనికి వాట్సాప్ లో వచ్చింది. రూ.15,000 ఇవ్వు లేదా వీడియోను నెట్‌లో పెడతాం అని కూడా మెసేజ్ వచ్చింది. దాంతో యువకుడు షాక్ అయ్యాడు. పరువు పోతుందని గూగుల్ పే ద్వారా వారు అడిగిన డబ్బు చెల్లించాడు. మర్నాడు మరోసారి రూ.10వేలు ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. దాంతో ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా నెంబర్ రాజస్థాన్ నుంచి వస్తుందని, అంతే కాకుండా ఆ వీడియో ఓ కనిపించిన యువతి కూడా నిజం కాదని తేలింది. ఓ పోర్నోగ్రఫీ చాట్ వీడియోని ప్లే చేసి నాటకమాడారని, త్వరలోనే ఆ ముఠాను పట్టుకుంటామని పోలీసుల తెలిపారు.

Tags:    

Similar News