పోలీస్ స్టేషన్లో యువతి ఆత్మహత్యాయత్నం
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్టేషన్‌లోనే పురుగుల మందు తాగింది. ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన దరిపల్లి రాజు, తను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు అదే గ్రామానికి చెందిన యువతి చెబుతోంది. అయితే తనను పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేసి తిరుగుతున్నాడని ఆరోపించింది. అతడితో తనకు వివాహం చేయాలని కోరుతూ గత నెల […]
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్టేషన్‌లోనే పురుగుల మందు తాగింది. ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన దరిపల్లి రాజు, తను ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు అదే గ్రామానికి చెందిన యువతి చెబుతోంది.
అయితే తనను పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేసి తిరుగుతున్నాడని ఆరోపించింది. అతడితో తనకు వివాహం చేయాలని కోరుతూ గత నెల 25న ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించింది. తనకు తల్లిదండ్రులు లేరని, న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని యువతి ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. కాగా, యువతి నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ముదిగొండ పోలీసులు తెలపడం గమనార్హం.