ప్రేమికుల రోజు ప్రేమికురాలు ఆత్మహత్య

దిశ, చేవెళ్ల : తాను ప్రేమించిన వ్యక్తితో పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుగుతున్న సమయంలో ప్రియురాలు సూసైడ్ చేసుకోవడం బాధాకరం. ఈ ఘటన పూర్తి వివరాళ్లోకి వెళితే.. శంకర్‌పల్లి మండలం మోకిలా తండా‌కు చెందిన అనూష (19) నర్స్ కోచింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నానని, ఫిబ్రవరి 5న తిరిగి వస్తానని జనవరి […]

Update: 2021-02-14 07:56 GMT

దిశ, చేవెళ్ల : తాను ప్రేమించిన వ్యక్తితో పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం జరుగుతున్న సమయంలో ప్రియురాలు సూసైడ్ చేసుకోవడం బాధాకరం. ఈ ఘటన పూర్తి వివరాళ్లోకి వెళితే..

శంకర్‌పల్లి మండలం మోకిలా తండా‌కు చెందిన అనూష (19) నర్స్ కోచింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నానని, ఫిబ్రవరి 5న తిరిగి వస్తానని జనవరి 19న ఇంటి నుంచి వెళ్లింది. ఫిబ్రవరి 5న ఆమె ఇంటికి రాలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో ఆమె తండ్రి వర్త్యజెత్యా ఆందోళనకు గురై శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆమె తాండూర్‌కు చెందిన ఓ యువకుడిని ప్రేమించినట్టు తేలింది. ఇద్దరినీ శంకర్ పల్లికి రావాలని ఫోన్‌లో సూచించారు. కానీ శనివారం అనూష మాత్రమే ఇంటికి వచ్చింది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ప్రేమించిన అబ్బాయితోనే పెండ్లి చేసుకుంటాననడంతో ఇంట్లో వారు నిరాకరించినట్టు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆమె బాత్‌రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags:    

Similar News