పాత కక్షలు.. యువకుడి దారుణ హత్య
దిశ, మెదక్: సినిమాల్లో చూపించే ఫ్యాక్షనిస్టుల మాదిరిగా.. పాత కక్షలతో ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రాంపూర్ గ్రామనికి చెందిన జెల్ల నర్సాగౌడ్(28) బుధవారం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తలపై బండ రాళ్లతో మోది హత్య చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, ఎస్‌ఐ […]
దిశ, మెదక్: సినిమాల్లో చూపించే ఫ్యాక్షనిస్టుల మాదిరిగా.. పాత కక్షలతో ఓ యువకున్ని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రాంపూర్ గ్రామనికి చెందిన జెల్ల నర్సాగౌడ్(28) బుధవారం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తలపై బండ రాళ్లతో మోది హత్య చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, ఎస్‌ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుడు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పెండ్లికి నిరాకరించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.