వరద ప్రవాహంలో తల్లీకొడుకులు.. ప్రాణాలకు తెగించిన యువకులు

దిశ, నెక్కొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదల్లో బైక్‌ల సాయంతో రోడ్లు దాటొద్దని పోలీసులు సూచించినా పలువురు సాహసం చేసి ప్రాణల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటన నెక్కొండ మండలంలోని గుండ్లచెరువు మత్తడి వద్ద చోటుచేసుకుంది. భారీ వరదలతో గుండ్లచెరువు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఓ తల్లి-కొడుకులు బైక్‌పై రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. కానీ, వరద ఉధృతి అధికం కావడంతో […]

Update: 2021-08-31 02:17 GMT

దిశ, నెక్కొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదల్లో బైక్‌ల సాయంతో రోడ్లు దాటొద్దని పోలీసులు సూచించినా పలువురు సాహసం చేసి ప్రాణల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘటన నెక్కొండ మండలంలోని గుండ్లచెరువు మత్తడి వద్ద చోటుచేసుకుంది.

భారీ వరదలతో గుండ్లచెరువు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. ఓ తల్లి-కొడుకులు బైక్‌పై రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. కానీ, వరద ఉధృతి అధికం కావడంతో ఒక్కసారిగా వరద నీటిలో పడిపోయారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న స్థానిక యువకులు శ్రవణ్, రమేష్, రాజులు అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న తల్లీకొడుకులను నీటిలో నుంచి బయటకు లాగి కాపాడారు. యువకుల సాహసానికి గ్రామస్తులు అభినందించారు.

Tags:    

Similar News