ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

దిశ ,బాన్సువాడ: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన బీర్పూర్ మండలం బైరా పూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముక్తార్ అనే వ్యక్తి వద్ద అదే గ్రామానికి చెందిన బీరు గొండ (21) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీర్పూర్ మండల కేంద్రంలోని నల్లచెరువు రోడ్డు వేసేందుకు మొరం కోసం మండలంలోని బైరాపూర్ గ్రామానికి వారు […]

Update: 2020-10-10 09:10 GMT

దిశ ,బాన్సువాడ:
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన బీర్పూర్ మండలం బైరా పూర్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముక్తార్ అనే వ్యక్తి వద్ద అదే గ్రామానికి చెందిన బీరు గొండ (21) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బీర్పూర్ మండల కేంద్రంలోని నల్లచెరువు రోడ్డు వేసేందుకు మొరం కోసం మండలంలోని బైరాపూర్ గ్రామానికి వారు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద బీరు గొండ పడిపోయాడు. దీంతో బీరు గొండకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బీరుగుండను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News