లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : పెళ్లి చేస్తారా.. టవర్ పైనుంచి దూకమంటారా..?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన అన్ని రంగాలు కుదేలయిన విషయం తెలిసిందే. ఇక ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు చెక్ పడింది. అతికొద్దిమంది బంధువుల మధ్య వివాహం జరుపుకోవచ్చని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పెళ్లి ని అతికొద్ది మంది బంధువుల మధ్య జరుపుకొంటుండగా.. మరికొంతమంది మాత్రం తమ పెళ్ళిని అంగరంగవైభవంగా జరుపుకోవాలని లాక్ డౌన్ అయ్యేవరకు వాయిదా వేసుకుంటున్నారు. అయితే ప్రేమించిన అమ్మాయితో తన పెళ్లిని తల్లిదండ్రులు వాయిదా […]

Update: 2021-06-15 01:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన అన్ని రంగాలు కుదేలయిన విషయం తెలిసిందే. ఇక ఇంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు చెక్ పడింది. అతికొద్దిమంది బంధువుల మధ్య వివాహం జరుపుకోవచ్చని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పెళ్లి ని అతికొద్ది మంది బంధువుల మధ్య జరుపుకొంటుండగా.. మరికొంతమంది మాత్రం తమ పెళ్ళిని అంగరంగవైభవంగా జరుపుకోవాలని లాక్ డౌన్ అయ్యేవరకు వాయిదా వేసుకుంటున్నారు. అయితే ప్రేమించిన అమ్మాయితో తన పెళ్లిని తల్లిదండ్రులు వాయిదా వేయడంతో ఓ యువకుడు మొబైల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హొసపేటె తాలూకాలోని మరియమ్మనహళ్లిలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే..

మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గోసంగి (23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువర్గ కుటుంబాలు అంగీకరించాయి. త్వరలోనే పెళ్లి చేయడానికి ఏర్పాటు కూడా చేశారు. అయితే మధ్యలో కరోనా లాక్ డౌన్ వలన వారి పెళ్లిని కొన్నిరోజులు వాయిదా వేశారు పెద్దలు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు గ్రామంలోని మొబైల్‌ టవర్‌ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేస్తారా లేదంటే దూకమంటారా అంటూ గట్టిగాకేకలు వేశాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడికి నచ్చజెప్పి కిందకు దింపారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Tags:    

Similar News