కరోనాతో యువ పుట్‌బాల్ కోచ్ మృతి

కరోనా వైరస్‌తో స్పానిష్‌కు చెందిన యువ పుట్‌బాల్ కోచ్ మృతి చెందాడు. దీంతో ఆ దేశంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అట్లెటికొ పొర్టాడ అల్టా జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్న యువ ప్రాన్సిస్కో గార్సియాకు వైరస్ సోకడంతో సోమవారం చనిపోయాడు. లుకేమియాతో బాధపడుతున్న అతడు ఇటీవల ఆసుపత్రిలో చేర్చాడు. పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడని అట్లెటికొ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు […]

Update: 2020-03-17 00:07 GMT

కరోనా వైరస్‌తో స్పానిష్‌కు చెందిన యువ పుట్‌బాల్ కోచ్ మృతి చెందాడు. దీంతో ఆ దేశంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అట్లెటికొ పొర్టాడ అల్టా జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్న యువ ప్రాన్సిస్కో గార్సియాకు వైరస్ సోకడంతో సోమవారం చనిపోయాడు. లుకేమియాతో బాధపడుతున్న అతడు ఇటీవల ఆసుపత్రిలో చేర్చాడు. పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడని అట్లెటికొ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలుపుతూ ట్విట్ చేసింది. ‘ గార్సియా నువ్వు లేని లోటు తీరనిది, నువ్వు లేక ఎలా ఆడగలం? నీకోసం ఖచ్చితంగా ఆడి గెలిచి తీరుతాం’ అని పేర్కొంది. గార్సియా మృతితో ప్రపంచంలో సోమవారం అధిక మరణాలు సంభవించిన దేశంగా స్పెయిన్ నిలిచింది.

Tags: carona, football, coach, dead, spain

Tags:    

Similar News