SRH అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారీ ధరకు అమ్ముడుపోయిన భువనేశ్వర్
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రారంభం నుంచి జట్టును బౌలింగ్ విభాగంలో నడిపిస్తూ వచ్చిన భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar)ను జట్టు వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రారంభం నుంచి జట్టును బౌలింగ్ విభాగంలో నడిపిస్తూ వచ్చిన భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar)ను జట్టు వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. ఈ మెగా వేలంలో భువిని ఎలాగైన తిరిగి హైదరాబాద్ జట్టు కొనుగోలు చేయాలంటూ.. సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. కానీ SRH అభిమానులకు ఎదురుదెబ్బ తగిలింది. వేలంలో రెండు కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలో నిలిచిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ ను కొనుగోలు చేసేందుకు, ముంబై(MI), లక్నో(LSG) జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. చివరకు లక్నో 9.50 కోట్లకు చేరగా ముంబై(MI) పోటీ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆర్సీబీ(RCB) జట్టు భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar)ను 10. 75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఆ జట్టును ఎప్పటినుంచి వెంటాడుతున్న బౌలింగ్ సమస్యకు భువి ద్వారా చెక్ పెట్టేందుకు ఆర్సీబీ జట్టు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి గత 10 సీజన్లకు పైగా సన్ రైజర్స్ జట్టును అంటిపెట్టుకున్న భువనేశ్వర్ కుమార్ ను జట్టు కోల్పోవడం.. పెద్ద ఎదురుదెబ్బగా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.