యువ క్రికెటర్ సూసైడ్
మనస్థాపానికి గురైన 25 ఏళ్ల యువక్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై రంజీ ట్రోఫీ నెట్స్ ప్రాక్టీస్‌లో సీనియర్ క్రికెటర్లకు బౌలింగ్ చేసే కరణ్ తివారీ కెరీర్ మీద బెంగతో ఈ అఘాయిత్యం చేసుకున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి వెల్లడించారు. కాగా తివారి… గోకుల్‌నగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉరేసుకుని మరణించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. పోలీసులు, […]
మనస్థాపానికి గురైన 25 ఏళ్ల యువక్రికెటర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై రంజీ ట్రోఫీ నెట్స్ ప్రాక్టీస్‌లో సీనియర్ క్రికెటర్లకు బౌలింగ్ చేసే కరణ్ తివారీ కెరీర్ మీద బెంగతో ఈ అఘాయిత్యం చేసుకున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి వెల్లడించారు.
కాగా తివారి… గోకుల్‌నగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉరేసుకుని మరణించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.
పోలీసులు, నేషనల్ మీడియా కథనం ప్రకారం.. తివారీ ఆత్మహత్యకు ముందు రాజస్థాన్‌లోని తన మిత్రుడికి ఫోన్ చేశాడు. సీనియర్ ర్యాంకుల్లో ఆడేందుకు తనకు అవకాశం రావడం లేదనీ.. చనిపోవాలని ఉందంటూ వాపోయాడు. దీంతో ఆటను వెంటనే తివారి సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పేలోపే అతడు ప్రాణాలొదిలేశాడు. రాత్రి 10:30 గంటల సమయంలో తన గదిలో లాక్ చేసుకున్న తివారి… కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లే లోపే మృతి చెందాడు.