ట్విట్టర్లో నయా ఫీచర్ ‘షెడ్యూల్ ట్వీట్ ’

దిశ, వెబ్ డెస్క్ : పొట్టి పొట్టి మెసేజ్ లతో నెటిజన్లను ఆకట్టుకునే ట్విట్టర్.. మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్విట్టర్ యూజర్లు తమ ట్వీట్లను డ్రాఫ్ట్స్ లా సేవ్ చేసుకోవచ్చని, ఏ టైమ్ లో కావాల్సి వస్తే.. ఆ టైమ్ ప్రకారం వాటిని షెడ్యూల్ చేసుకోని ట్వీట్ చేయొచ్చని గురువారం ట్విట్టర్ కంపెనీ తెలిపింది. ఈ షెడ్యూల్​ ఫీచర్.. ‘ట్విట్టర్ ఫర్ డెస్క్’ పేరుతో మొన్నటి వరకు డెస్క్​టాప్​ వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం […]

Update: 2020-05-29 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్ :
పొట్టి పొట్టి మెసేజ్ లతో నెటిజన్లను ఆకట్టుకునే ట్విట్టర్.. మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్విట్టర్ యూజర్లు తమ ట్వీట్లను డ్రాఫ్ట్స్ లా సేవ్ చేసుకోవచ్చని, ఏ టైమ్ లో కావాల్సి వస్తే.. ఆ టైమ్ ప్రకారం వాటిని షెడ్యూల్ చేసుకోని ట్వీట్ చేయొచ్చని గురువారం ట్విట్టర్ కంపెనీ తెలిపింది.

ఈ షెడ్యూల్​ ఫీచర్.. ‘ట్విట్టర్ ఫర్ డెస్క్’ పేరుతో మొన్నటి వరకు డెస్క్​టాప్​ వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లకు ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది. దీని ద్వారా ముందుగానే ట్వీట్​ చేసుకొని.. అనుకున్న స‌మ‌యానికి సెండ్​చేసుకునే సౌకర్యం ఉంటుంది. స్నేహితులు, కొలిగ్స్, బంధువులు ఇలా ఎవరి పుట్టిన రోజు శుభాకాంక్షలు అయినా.. షార్ప్ గా 12 గంటలకు పంపాలనుకునే వాళ్లకు.. ట్విట్టర్ తెచ్చిన ఈ షెడ్యూల్డ్ ట్వీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం మనం 12 వరకు వేచి ఉండనక్కర్లేదు. ట్విట్టర్ లో షెడ్యూల్డ్ చేసుకుని 10 గంటలకు పడుకున్నా.. 12 గంటలకు మన మెసేజ్ పర్టిక్యులర్ పర్సన్ కు చేరిపోతుంది. ట్వీట్​ చేసే ముందు.. మరోసారి చెక్ చేసుకునే వీలు కూడా కల్పించింది. సోషల్​ మీడియా మెనేజర్లు, మీడియా ప్రతినిధులకు ఈ ఫీచ‌ర్ ఎంతగానో యూజ్ అవుతోంద‌ని ట్విట్టర్​ భావిస్తోంది.

ఎలా చేయాలి

– ట్వీట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, ఐకాన్స్ లో కేలండర్ కనపిస్తుంది.
– కేలండర్ పై క్లిక్ చేసి.. టైమ్ అండ్ డేట్ డిసైడ్ చేసుకోవాలి.
-డిటైల్స్ ఎంటర్ చేశాక.. కన్ ఫర్మ్ చేయాలి.
అంతే… ఫిక్స్ చేసిన తేదిలో, పర్టిక్యులర్ టైమ్ కు ఆ మెసేజ్ వాళ్లకు చేరిపోతుంది.ట్వీట్ ను సేవ్ చేయాలనుకుంటే.. క్లోజ్ విండో ఐకాన్ పై క్లిక్ చేయగానే.. సేవ్ చేయాలా వద్దా అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేయగానే.. డ్రాఫ్ట్ సెక్షన్ లో మన ట్వీట్ సేవ్ అవుతుంది.

Tags:    

Similar News