దారుణం.. భూమి కాజేయ్యొద్దంటే రూ. కోటి రూపాలియ్యాలంట
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం గత 70 సంవత్సరాలుగా కొనసాగుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటది. సర్వే నెంబర్ 623లో ఈ దేవాలయం ఉంది. అయితే, ఈ దేవాలయం ఉన్న భూమిలో కడీలతో పెన్సింగ్ వేశారు. ఈ భూమి గతంలో తమ పేరు మీద ఉందంటూ ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. లేదంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని ఎల్లమ్మ […]
దిశ, ఇందల్వాయి: ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం గత 70 సంవత్సరాలుగా కొనసాగుతుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటది. సర్వే నెంబర్ 623లో ఈ దేవాలయం ఉంది. అయితే, ఈ దేవాలయం ఉన్న భూమిలో కడీలతో పెన్సింగ్ వేశారు. ఈ భూమి గతంలో తమ పేరు మీద ఉందంటూ ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. లేదంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు జోక్యం చేసుకుని ఎల్లమ్మ ఆలయ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలోనే ఈ భూమిని ఓ వ్యక్తి అమ్ముకున్నాడని మళ్లీ ఇప్పుడు ఆ భూమి నాది అంటున్నాడని.. ఇది ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మార్వో వివరణ
ఎల్లమ్మ గుడి ముందర కడీలతో పెన్సింగ్ చేసిన విషయమై తమకు ఓ వ్యక్తి నాలా కన్వర్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడని, అట్టి దరఖాస్తును రిజెక్ట్ చేశామని ఎమ్మార్వో తెలిపారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. అట్టి భూమిని రిజెక్ట్ చేయాలని పై అధికారులకు విన్నవించానని ఎమ్మార్వో పేర్కొన్నారు.