స్కూల్ ప్రిన్సిపాల్, 9 మంది ఉపాధ్యాయులు, నలుగురు విద్యార్థులపై 1 సంవత్సరం పాటు గ్యాంగ్ రేప్..
దిశ, వెబ్ డెస్క్: నలుగురు విద్యార్థులపై 9 మంది ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ 1 సంవత్సరం పాటు సామూహిక అత్యాచారానకి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో జరిగింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాధితురాలి తండ్రి ప్రశ్నించడంతో అయితే ఈ విషయం వారికి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న బాధితురాలు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో కలిసి ఏడాది పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. మగ టీచర్లకు సహకరిస్తూ.. ఇద్దరు మహిళా టీచర్లు వీడియోలు తీశారని […]
దిశ, వెబ్ డెస్క్: నలుగురు విద్యార్థులపై 9 మంది ఉపాధ్యాయులు, స్కూల్ ప్రిన్సిపాల్ 1 సంవత్సరం పాటు సామూహిక అత్యాచారానకి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో జరిగింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాధితురాలి తండ్రి ప్రశ్నించడంతో అయితే ఈ విషయం వారికి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న బాధితురాలు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌తో కలిసి ఏడాది పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. మగ టీచర్లకు సహకరిస్తూ.. ఇద్దరు మహిళా టీచర్లు వీడియోలు తీశారని బాధిత విద్యార్థి చెప్పింది.
ఈ విషయానికి సంబంధించి మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని మంధాన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ముఖేష్ యాదవ్ తెలిపారు. విచారణ సమయంలో, మరో ముగ్గురు బాధితులు ముందుకు వచ్చి ప్రిన్సిపాల్,అలాగే ఉపాధ్యాయులపై సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించినట్లు సమాచారం. బాధితుల్లో 3, 4, 6 తరగతుల విద్యార్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితులు బెదిరించారని బాధితులు తెలిపారు. బాధితురాలు ఈ విషయాన్ని ఓ మహిళా టీచర్ కి ఫిర్యాదు చేయగా అమే బాలికతో తన స్కూల్ ఫీజులను, పుస్తకాల ఖర్చు చెల్లిస్తామని.. అమ్మయిలను ప్రలోభ పెట్టినట్లు సమాచారం.
“దీని తర్వాత, మేడమ్ నన్ను ముగ్గురు ఉపాధ్యాయులుు, ప్రిన్సిపాల్ చాలాసార్లు ఇంటికి తీసుకువెళ్లారు. టీచర్లంతా ఇంట్లో మద్యం సేవించారు. తరువాత, వారు నా బట్టలు విప్పి, తప్పుడు పనులు చేశారు, ”అని బాధితుల్లో ఒకరు మీడియాకు తెలిపారు. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తన సోదరుడు మంత్రి అని చెప్పినట్లు సమాచారం ఉంది. బాధితుల్లో ఒకరి తండ్రి మాట్లాడుతూ.. ఈ సంఘటన పై ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడానికి పాఠశాల కు వెళ్లినప్పుడు, ప్రిన్సిపాల్ అన్ని ఆరోపణలను కొట్టిపారేశాడన్నారు. ఈ విషయం పై ఫిర్యాదు చేస్తే నన్ను చంపేస్తామని బెదిరించారని బాధితురాలి తండ్రి చెప్పారు. ఈ కేసులో నిందితులు ప్రిన్సిపాల్‌తో సహా ఉపాధ్యాయులపై పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.