టీడీపీకి పోటీగా వైసీపీ ర్యాలీ.. ఉద్రిక్తత

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌పై టీడీపీ పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. హంద్రీనీవా పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఉదయం ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. రామకుప్పం వైపు ఉన్నటువంటి రహదారులను దిగ్భంధించారు. అంతేగాకుండా టీడీపీ పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు కూడా భారీ ర్యాలీకి సిద్ధం అయ్యారు. ఇళ్ల స్థలాల పంపిణీపై టీడీపీ తీరును తప్పుబడుతూ… […]

Update: 2020-10-25 20:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌పై టీడీపీ పాదయాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. హంద్రీనీవా పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఉదయం ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. రామకుప్పం వైపు ఉన్నటువంటి రహదారులను దిగ్భంధించారు. అంతేగాకుండా టీడీపీ పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు కూడా భారీ ర్యాలీకి సిద్ధం అయ్యారు. ఇళ్ల స్థలాల పంపిణీపై టీడీపీ తీరును తప్పుబడుతూ… భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో రెండు పార్టీలు ఎలాంటి ర్యాలీలు, పాదయాత్రలు చేయొద్దని, అనుమతులు లేవని, పోలీసులు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో రామకుప్పంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

Tags:    

Similar News