రాజ్యసభలో వైసీపీ ఎంపీల ఆందోళన..
దిశ,ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై చర్చను చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం కూడా నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి రూల్-267 కింద ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చను ప్రారంభించాలని కోరారు. అయితే ఇప్పటికిప్పుడే దీనిపై చర్చించలేమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. […]
దిశ,ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై చర్చను చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం కూడా నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి రూల్-267 కింద ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చను ప్రారంభించాలని కోరారు. అయితే ఇప్పటికిప్పుడే దీనిపై చర్చించలేమని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలియజేశారు.
ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టి మంగళవారం రాజ్యసభలో నాతోపాటు సహచర పార్టీ సభ్యులందరం కలసి 'మాకు న్యాయం చేయాలి' అన్న నినాదాలతో కొద్దిసేపు సభా కార్యక్రమాలను స్తంభింపచేయడం జరిగింది. pic.twitter.com/Sulz5bWowU
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2021