‘వైసీపీ ఎంపీలు రాజీనామాలు చెయ్యాల్సిందే’

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరోసారి నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం సీఎం జగన్ యువతకు చేసిన పెద్ద మోసమని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసులతో భయపడ్డ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయారన్నారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాదని చేతులెత్తేసిన జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఏపిలో 2020-21 […]

Update: 2021-06-19 03:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మరోసారి నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం సీఎం జగన్ యువతకు చేసిన పెద్ద మోసమని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసులతో భయపడ్డ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయారన్నారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాదని చేతులెత్తేసిన జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ఏపిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి దిగజారి పోయాయని విమర్శించారు. నిరుద్యోగ రేటు 13.5కి పెరిగిపోయిందని యనమల చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేకనే కంపెనీలు ఏపీకి రావడం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు పోరాటం చేయడం లేదని మండిపడ్డారు. అలాంటి ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఆ ఎంపీలంతా రాజీనామా చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు

Tags:    

Similar News