చంపుతామని వైసీపీ ఎంపీలు బెదిరిస్తున్నారు.. ఎంపీ రఘురామ ప్రధానికి లేఖ

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో లోక్‌సభలో కొందరు వైసీపీ ఎంపీలు బెదిరించినట్లు ఆరోపించారు. బుధవారం పార్లమెంటు కారిడార్‌లోకి వెళుతుండగా వైసీపీ ఎంపీలు తనను చంపుతామని బెదిరించినట్లు రఘురామ చెప్పుకొచ్చారు. ఎంపీ నందిగం సురేశ్‌పేరు ఈ ఫిర్యాదులో ప్రస్తవించినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం హిందూపురం […]

Update: 2021-12-08 08:51 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో లోక్‌సభలో కొందరు వైసీపీ ఎంపీలు బెదిరించినట్లు ఆరోపించారు. బుధవారం పార్లమెంటు కారిడార్‌లోకి వెళుతుండగా వైసీపీ ఎంపీలు తనను చంపుతామని బెదిరించినట్లు రఘురామ చెప్పుకొచ్చారు.

ఎంపీ నందిగం సురేశ్‌పేరు ఈ ఫిర్యాదులో ప్రస్తవించినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మర్డర్ చేస్తానంటూ బెదిరించారని ఎంపీ రఘురామ ఆరోపించారు. అయితే ఏం చేసుకుంటావో చేసుకోమని తాను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. అనంతరం రాజధాని అమరావతి రైతుల సభకు పోలీసులు అనుమతి ఇవ్వాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. వారు సభ పెట్టుకుంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. రాజధాని రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News