టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలపై  గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో టీడీపీ నేతలు దద్దమ్మల్లా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక సమావేశం టీడీపీ భజనమండలి సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసిన టీడీపీ నేతలు, రక్షిస్తున్నట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖను పాలనా రాజధానిగా ఒప్పుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని టీడీపీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. […]

Update: 2021-08-31 04:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలపై గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో టీడీపీ నేతలు దద్దమ్మల్లా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక సమావేశం టీడీపీ భజనమండలి సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసిన టీడీపీ నేతలు, రక్షిస్తున్నట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖను పాలనా రాజధానిగా ఒప్పుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని టీడీపీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖను కాకుండా అమరావతిని రాజధానిగా ఎందుకు చేశారో టీడీపీ నేతలు చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. త్వరలోనే విశాఖ పాలనా రాజధాని అవుతుందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, టీడీపీ నేతలు సిద్ధమా? అని అమర్నాథ్ సవాల్ విసిరారు. మరి వైసీపీ నేతల సవాళ్లకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News