‘హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కులు ఆయనవే’

దిశ, ఏపీ బ్యూరో: దుర్మార్గపు పాలన, హత్యా రాజకీయాలు చేయడంలో నేర్పరి చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కులు మొత్తం చంద్రబాబుకే దక్కుతాయన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సొమ్మును దోచుకున్న వారిని అరెస్ట్ చేయకుండా.. పల్లకి ఎక్కించి ఊరేగింపు చేయాలా అంటూ […]

Update: 2020-06-25 05:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: దుర్మార్గపు పాలన, హత్యా రాజకీయాలు చేయడంలో నేర్పరి చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు పేటెంట్ హక్కులు మొత్తం చంద్రబాబుకే దక్కుతాయన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సొమ్మును దోచుకున్న వారిని అరెస్ట్ చేయకుండా.. పల్లకి ఎక్కించి ఊరేగింపు చేయాలా అంటూ ప్రశ్నించారు. ఈ స్కామ్‌ విచారణ పూర్తి అయితే.. అసలు దొంగలు బయటకు వస్తారని జోగి రమేశ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News