లోకేశ్! నోరు అదుపులో పెట్టుకో..వైసీపీ ఎమ్మెల్యేలు వార్నింగ్

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సెటైర్లు వేస్తున్నారు. గాలిగాడు జగన్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డిలు లోకేశ్‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో పోరాడి […]

Update: 2021-11-13 03:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సెటైర్లు వేస్తున్నారు. గాలిగాడు జగన్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డిలు లోకేశ్‌లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో పోరాడి 151 స్థానాల్లో గెలుపొంది ముఖ్యమంత్రి అయిన గొప్ప నాయకుడు అయితే.. లోకేశ్‌ది దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన చరిత్ర అని వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో లోకేశ్ ఎన్ని పిల్లిమెుగ్గలు వేసినా గెలుపు మాత్రం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. దాచేపల్లి, గురజాల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. సీఎం వైఎస్ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే వైసీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. 900 ఏళ్ల చరిత్ర కలిగిన గురజాల, దాచేపల్లి గ్రామాలను పట్టణాలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు.

విద్య, వైద్య, సాగు, తాగునీటి పరంగా, సొంత ఇళ్ల పట్టాలు, రోడ్ల పరంగా పల్నాడు ప్రాంత రూపురేఖలను సీఎం వైఎస్ జగన్ మార్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పల్నాడుకు చేసిందేమీ లేదన్నారు. కనీసం గురజాల, దాచేపల్లిని మున్సిపాలిటీలు ఎందుకు చేయలేకపోయారు..? అని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కాలేజీ, ఆస్పత్రి, హైవే, పట్టణం, మంచినీరు ఇచ్చావా అని నిలదీశారు.

మతాలు, కులాలను రెచ్చగొట్టి చిచ్చుపెట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగలనుందని ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డిలు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News