అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే..
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అందరు ముందు చూపు ఉన్న వ్యక్తి అంటుంటారని, అది నిజమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎప్పుడో ఒకప్పుడు భూస్థాపితం చేస్తారని, ఏపీ నుంచి మూట ముళ్ల సర్ధుకోవాల్సి వస్తుందని ముందే తెలిసి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని.. అందువల్లే ఆయనకు ముందు చూపు ఉందని తెలుస్తోందంటూ సెటైర్లు వేశారు. […]
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అందరు ముందు చూపు ఉన్న వ్యక్తి అంటుంటారని, అది నిజమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎప్పుడో ఒకప్పుడు భూస్థాపితం చేస్తారని, ఏపీ నుంచి మూట ముళ్ల సర్ధుకోవాల్సి వస్తుందని ముందే తెలిసి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని.. అందువల్లే ఆయనకు ముందు చూపు ఉందని తెలుస్తోందంటూ సెటైర్లు వేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మహిళా సాధికారతపై చర్చలో పాల్గొన్న ఆమె చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని, కానీ ఈ రోజు నేను చెబుతున్నా.. ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కాదు. రాజకీయాలు కూడా కూలిపోతాయని అక్క చెల్లెమ్మలందరు చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పుకొచ్చారు. పాపం ఇప్పటికే ఉత్తర కుమారుడిని చూసుకొని చంద్రబాబు ఏడ్వని రోజంటూ లేదన్నారు. ఇదిలా ఉంటే కుప్పంలోని ప్రజలు ఆయన్ను నిండా ముంచేశారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో కూడా తెలియడం లేదని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అక్కాచెల్లెలంతా సంతోషంగా ఉన్నారని.. తమ నియోజకవర్గంలోని మహిళలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెలందరి ఆశీస్సులతో, దీవెనలతో మరింత కాలంపాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో తానొక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నట్లు ఎమ్మెల్యే ధనలక్ష్మి స్పష్టం చేశారు.