టీడీపీ నేతల 2వేల ఎకరాల భూకబ్జా.. ఆధారాలతో ప్రజల ముందుకు వైసీపీ
దిశ,వెబ్ డెస్క్ : భూ ఆక్రమణలు, బినామీ ఆస్తులపై వైసీపీ- టీడీపీ నేతల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయగా.. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు. అయితే వెలగపూడి సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈస్ట్ […]
దిశ,వెబ్ డెస్క్ : భూ ఆక్రమణలు, బినామీ ఆస్తులపై వైసీపీ- టీడీపీ నేతల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయగా.. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో వైసీపీ నేతలు ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాలు విసిరారు.
అయితే వెలగపూడి సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్వీకరించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో వెలగపూడి కోసం ఎదురు చూస్తానని సూచించారు. గాజువాక నుంచి బీచ్ రోడ్ కు ర్యాలీగా బయలు దేరి అక్కడ..వైఎస్ విగ్రహం నుంచి సాయిబాబా గుడి వరకు పాదయాత్ర చేయనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తాటాకు చప్పుళ్లకు బయపడబోదని అన్నారు. తాను ఒక్కగజం కబ్జా చేసినా రాజకీయం నుంచి తప్పుకుంటానని వెలగపూడి అన్నారని.., ఒక్క గజం కాదు దాదాపు 225గజలా రూ. కోటి విలువైన స్థలాన్ని ఆయన కబ్జా చేసినట్లు.., కబ్జా చేసిన స్థలంలో వెలగపూడి ఇళ్లు కట్టుకున్నారని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని ప్రజలముందు ఉంచుతామన్నారు. వెలగపూడి ఎక్కడ..? విజసాయిరెడ్డి ఎక్కడ..? విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే అర్హత వెలగపూడికి లేదన్నారు.
ఒకటిన్నర సంవత్సర కాలంలో విశాఖ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.2వేల కోట్ల విలువైన 171ఎకరాల భూముల్ని టీడీపీ నేతలు కబ్జా చేశారన్నారు. టీడీపీ కి చెందిన ఏ నేత ఎన్ని ఎకరాలు కబ్జా చేశారనే ఆధారాలు ఉన్నాయని , వాటిని త్వరలో బహిరంగంగా విడుదల చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ తెలిపారు.