తెలంగాణ మంత్రికి ఏపీ మంత్రి కౌంటర్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన.. సీఎం వైఎస్ జగన్‌పైన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మరోమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీపై అవాకులు చవాకులు పేల్చడం మంచిది కాదని హితవు పలికారు. కర్నూలులో శనివారం […]

Update: 2021-11-13 04:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన.. సీఎం వైఎస్ జగన్‌పైన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా మరోమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు ఏపీపై అవాకులు చవాకులు పేల్చడం మంచిది కాదని హితవు పలికారు.

కర్నూలులో శనివారం శ్రీశైలం శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బలవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని లాక్కుని ఇప్పుడు ఆర్ధికంగా బలంగా ఉన్నామని ఏపీపై విమర్శలు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పదే పదే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మంచిది కాదని ఇకనైనా ఇలాంటి విధానాలు మానుకుంటే మంచిదని మంత్రి వెల్లంపల్లి సూచించారు. ఈ సందర్భంగా శ్రీశైలం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే నిధులు మంజూరుకు సీఎం జగన్‌ సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. మల్లికార్జునుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.

చంద్రబాబు గురించి వైఎస్ చెప్పింది నిజమే

మాజీ సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడతారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబుకు ముని శాపం ఉందని, ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు నిజాలు మాట్లాడితే తల వేయి వక్కలు అవుతుందని గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో చెప్పేవారని ఇప్పుడు అది నిజమనిపిస్తోందని చెప్పుకొచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News