తిరుపతి లోక్‌సభ ఎన్నికపై వైసీపీ సమీక్ష

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం సమీక్షా సమావేశం నిర్వహించింది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఇప్పటికే టీడీపీ నుంచి అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికార పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు […]

Update: 2020-11-19 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ అభ్యర్థిపై వైసీపీ అధిష్టానం సమీక్షా సమావేశం నిర్వహించింది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. అంతేగాకుండా ఇప్పటికే టీడీపీ నుంచి అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో అధికార పార్టీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది.

Tags:    

Similar News