అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడికి కుట్ర :సజ్జల

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడికి కుట్ర జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహాల దాడుల విషయంలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక సమర్పించిందని అన్నారు. కాగా, చింతలపూడిలో అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

Update: 2021-02-03 02:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడికి కుట్ర జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహాల దాడుల విషయంలో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక సమర్పించిందని అన్నారు. కాగా, చింతలపూడిలో అంబేద్కర్‌ విగ్రహానికి చెప్పుల దండ వేసిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది.

రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News