చంద్రబాబయితే పారిపోయేవారు : సజ్జల

దిశ, ఏపీబ్యూరో : కోవిడ్​ వైరస్​ను ఎదుర్కొనే పరిస్థితుల్లో చంద్రబాబయితే పారిపోయేవారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి కాబట్టి ఆ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు. చంద్రబాబు దార్శనికత దురదృష్టమైతే వైఎస్‌ జగన్ దార్శనికత ఒక అదృష్టంగా పేర్కొన్నారు. ఎందుకూ పనికిరాని ఒక విజన్ ద్వారా చంద్రబాబు ప్రజలను భ్రమపెట్టినట్లు చెప్పారు.నాడు వైఎస్సార్‌పై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి […]

Update: 2021-01-01 10:51 GMT

దిశ, ఏపీబ్యూరో : కోవిడ్​ వైరస్​ను ఎదుర్కొనే పరిస్థితుల్లో చంద్రబాబయితే పారిపోయేవారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి కాబట్టి ఆ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు. చంద్రబాబు దార్శనికత దురదృష్టమైతే వైఎస్‌ జగన్ దార్శనికత ఒక అదృష్టంగా పేర్కొన్నారు.

ఎందుకూ పనికిరాని ఒక విజన్ ద్వారా చంద్రబాబు ప్రజలను భ్రమపెట్టినట్లు చెప్పారు.నాడు వైఎస్సార్‌పై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి ప్రచారం చేశారు. తర్వాత వైఎస్‌ జగన్ విషయంలోనూ అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. 2019 తీర్పు చూస్తే విశ్వనీయతకు పట్టం కట్టి వారి అబద్దాలను ప్రజలు తిప్పికొట్టినట్లు స్పష్టమైందని సజ్జల అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని చెప్పారు. ఎవర్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఆచరణలో గమనిస్తున్నారు. ప్రచార పటోటోపాలు చెల్లవని నిరూపించినట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News