వైఎస్ఆర్ పేరును జగన్ చెడగొడుతున్నారు.. వైసీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి షాక్ ఇచ్చారు. జగన్ పాలన అధ్వానంగా ఉందంటూ తేల్చిపారేశారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఓట్లు వేసిన ప్రజలు ఓడిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది అనుకున్నారు. కానీ ఎవరికీ ఏమీ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. ప్రతి పథకానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చెడగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. […]

Update: 2021-12-01 03:10 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి షాక్ ఇచ్చారు. జగన్ పాలన అధ్వానంగా ఉందంటూ తేల్చిపారేశారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఓట్లు వేసిన ప్రజలు ఓడిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే న్యాయం జరిగింది అనుకున్నారు. కానీ ఎవరికీ ఏమీ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. ప్రతి పథకానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చెడగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పథకాన్ని రద్దు చేసిన మీరు.. కొత్త పథకాలకు ఆయన పేరు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం ద్వారా వచ్చిన డబ్బులు మళ్ళీ యాజమాన్యాలకు కట్టకుంటే మళ్లీ పెన్షన్ ఇవ్వమని చెప్పడం సరికాదన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో జబ్బుల సంఖ్య పెంచినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ ఆ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని కూడా తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. జగనన్న విద్యా దీవెన లాంటి ఎన్నో పథకాలు నిర్వీర్యం అయ్యాయని కుండబద్దలు కొట్టారు.

జగనన్న శాశ్వత గృహ నిర్మాణ పథకం రద్దు చేయండి

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలు పేరుతో లబ్దిదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న శాశ్వత గృహ నిర్మాణ పథకంలో రూ.10 వేలు కట్టకుంటే పెన్షన్ తీసేస్తాం అనడం సమంజసం కాదన్నారు. గ్రామాలలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చేలా ఈ నిర్ణయం ఉందన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రద్దు చేయాలని డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. ఈ పథకం ద్వారా రూ.1,500 కోట్లు మాత్రమే వస్తుందని ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్థంగా ఉందన్న ఆయన త్వరలో రాష్ట్రం దివాలా తీసే అవకాశం లేకపోలేదన్నారు. మరోవైపు అధికారులు సైతం సీఎం జగన్ ఏమి చెప్తే దానికి తల ఊపి సంతకం పెట్టడం ఏంటని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని.. అలాగే రైతుల నుండి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని.. ఎక్కడ కొంటున్నారో కూడా తెలియని పరిస్థితిలో రైతాంగం ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 95,100 ఇవ్వడం సరికాదన్నారు. ఈ రెండున్నరేళ్లు పాలన దారుణంగా ఉందని ఇకనైనా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సూచించారు.

చంద్రబాబు ఓడిపోయింది అందుకే

గత ఎన్నికల్లో అవినీతి వల్లే తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైందని.. జగన్ పాలనలో కూడా అంతే స్థాయిలో అవినీతి జరుగుతుందన్నారు. దిగువ స్థాయిలో అవినీతి అదుపు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. అవినీతి పేద ప్రజలను తినేస్తుంది. అవినీతి అధికారులను సైతం ఈ ప్రభుత్వం దూరంపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అవినీతి అధికారులను తొలగించినందు వల్లే 5సార్లు ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. ఈ అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు.

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అవలంబించే పద్ధతులు పాటిస్తే మరోమారు సీఎం జగన్ అధికారంలోకి వస్తారని లేకపోతే లేదని చెప్పేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కన్నా ఎక్కువ పేరు సంపాదించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఆయన పెట్టిన పథకాలను తొలగించేస్తున్నారని విమర్శించారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదన్నారు. ఈసారి ఓట్లు అడిగేందుకు వెళ్తే ప్రజలు తిరగబడి కొడతారని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News