నామినేషన్ పత్రాలతో పారిపోతున్నారు: యనమల
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అక్రమాలు, దౌర్జన్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పటికీ రాజ్‌భవన్ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలపై గవర్నర్‌కు రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని ఆయన నిట్టూర్చారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కోర్టులు, గవర్నర్‌ల తరువాత ప్రజలదేనన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని […]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అక్రమాలు, దౌర్జన్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పటికీ రాజ్‌భవన్ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలపై గవర్నర్‌కు రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని ఆయన నిట్టూర్చారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కోర్టులు, గవర్నర్‌ల తరువాత ప్రజలదేనన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌లు వేయడానికి వస్తుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆ పత్రాలు లాక్కొని పారిపోతున్నారని ఆరోపించారు. మరికొందరిపై దాడులు చేస్తున్నారని ఆయన తెలిపారు.
Tags: tdp, ysrcp, yanamala ramakrishnudu, mangalagiri