"వాత.. కోత.. రోత"

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన వాత, కోత, రోతగా ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో టీడీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ మాయ పథకాలు అమలు చేశారని అన్నారు. మధ్య పెట్టేపథకాలతో ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు. ఏడాదిలోనే ప్రజలు జన్మాయ నుంచి బయటపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఏడాది […]

Update: 2020-07-12 00:29 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన వాత, కోత, రోతగా ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో టీడీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ మాయ పథకాలు అమలు చేశారని అన్నారు. మధ్య పెట్టేపథకాలతో ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు. ఏడాదిలోనే ప్రజలు జన్మాయ నుంచి బయటపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాల రద్దుతో 18,026 కోట్ల రూపాయల లబ్దిని ప్రజలకు దూరం చేశారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News